ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రతిరోజు ఆర్టీసీకి రూ. 50 లక్షల ఆదాయం - కడప ఆర్టీసీ తాజా వార్తలు

లాక్​డౌన్​ నిబంధనల సడలింపుల అనంతరం ప్రతి రోజు ఆర్టీసీకి రూ. 50 లక్షల ఆదాయం వస్తోంది. ప్రస్తుతం పూర్తి సామర్థ్యంతో జిల్లాలో బస్సులను నడుపుతున్నారు. రానున్న రోజుల్లో సంస్థను లాభాల బాట పట్టించే విధంగా కృషి చేస్తామని అధికారులు, కార్మికులు విశ్వాసం వ్యక్తం చేశారు.

kadapa rtc daily profit
కడప ఆర్టీసీ రోజు ఆదాయం రోజూ 50 లక్షలు

By

Published : Oct 4, 2020, 10:26 PM IST

లాక్​డౌన్​ నిబంధనలు సడలించడం వల్ల ఆర్టీసీ నెమ్మదిగా పుంజుకుంటోంది. జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు రూ. 50 లక్షల రూపాయల ఆదాయం వస్తోంది. లాక్​డౌన్​ సమయంతో పోల్చుకుంటే 4 రెట్లు ఆదాయం పెరిగింది. జిల్లా వ్యాప్తంగా 8 డిపోల పరిధిలో దాదాపు 900 బస్సు సర్వీసులు ఉన్నాయి. మార్చి 21వ తేదీ నుంచి లాక్​డౌన్​ కావడం వల్ల సర్వీసులు నిలిపివేశారు. అనంతరం మే 21వ తేదీ నుంచి బస్సు సర్వీసులు ప్రారంభించారు.

మొదట్లో కేవలం రూ. 12 లక్షల రూపాయలు మాత్రమే ఆదాయం వచ్చేది. తదుపరి లాక్​డౌన్​ నిబంధనలు సడలించడం వల్ల పూర్తి సామర్థ్యంతో బస్సులు నడపారు. అందువల్ల రోజుకు 1.60 కిలోమీటర్ల మేర బస్సు సర్వీసులను నడిపి రూ. 50 లక్షల ఆదాయం వస్తోంది. ప్రస్తుతం రోజుకు 400 బస్సు సర్వీసులను నడుపుతున్నారు. చెన్నై, హైదరాబాద్ తప్ప మిగిలిన అన్ని ప్రాంతాలకు బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు. రానున్న రోజుల్లో ఆర్టీసీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు అధికారులు, కార్మికులు కృషి చేస్తామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details