సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వచ్చిన వారందరూ తిరుగు ప్రయాణాలు సాగిస్తున్నారు. దీనివల్ల కడప ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడింది. హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాలకు వెళ్లే వారితో బస్టాండ్ ఆవరణం పూర్తిగా నిండిపోయింది. రద్దీ దృష్ట్యా అదనపు బస్సులు ఏర్పాటు చేస్తున్నామని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు.
పండగ ముగిసింది... పట్నం పిలిచింది! - కడప ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికుల రద్దీ
సంక్రాంతిని జరుపుకునేందుకు పట్టణాల నుంచి సొంతూళ్లకు వచ్చిన వారంతా... బతుకుదెరువు కోసం మళ్లీ తిరుగు ప్రయాణమవుతున్నారు. ఈ క్రమంలో ప్రయాణికులతో కడప ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం పూర్తిగా నిండిపోయింది. రద్దీ దృష్ట్యా ఆర్టీసీ అధికారులు అదనపు బస్సులు నడుపుతున్నారు.
తిరుగు ప్రయాణికులతో కడప ఆర్టీసీ బస్టాండ్