లాక్ డౌన్ తర్వాత రోడ్లపైకి వచ్చే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల మధ్య భౌతిక దూరం పాటించే విధంగా సీట్లను మార్చే ప్రక్రియను ఆర్టీసీ వేగవంతం చేసింది. కడప జిల్లాలో 8 డిపోల పరిధిలోని సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ బస్సులకు సీట్లు మారుస్తున్నారు. ఎక్స్ ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లోనూ భౌతికదూరం పాటించే విధంగా సీట్లకు క్రాస్ మార్కు వేస్తున్నామని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జితేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.
నిలబడ్డానికి అనుమతి లేదు...
ప్రతి బస్సులో 20 నుంచి 25 మంది ప్రయాణికులు మాత్రమే కూర్చునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఏ బస్సులోనూ నిలబడి ప్రయాణించేందుకు అనుమతి లేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని రూట్లకు బస్సులు అవసరమా లేదా అనేది ఆలోచన చేస్తున్నామన్న ఆయన... ఎప్పటి నుంచి బస్సులు తిరుగుతాయనేది ఇంకా ఆదేశాలు రాలేదన్నారు. అయితే అనుమతి వచ్చేలోపు బస్సుల మరమ్మతులు, సీట్ల కుదింపు వంటి చర్యలు చేపట్టామని చెప్పారు.