కడప రాజంపేట జాతీయ రహదారిలో రామాపురం చెక్ పోస్ట్ నుంచి ఇసుకపల్లి, తాళ్లపాక మీదుగా హత్యరాలకు 2009లో సుమారు 4.4 కోట్ల రూపాయలతో 9.6 కిలోమీటర్ల రహదారిని నిర్మించారు. ఈ రోడ్డు ఇప్పుడు అస్తవ్యస్తంగా మారింది. ఎటు చూసినా ఎత్తుపల్లాలు, గుంతలమయంగా దర్శనమిఇస్తోంది. తాళ్ళపాక సమీపంలోని కాజ్ వే అడ్డదిడ్డంగా మారింది. ఈ మార్గంలో ప్రయాణించలేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. రామాపురం ఇసుకపల్లికి మధ్యలో పర్యటక మార్గం పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. ఇక్కడ నిర్మిస్తున్న ఒక వంతెన అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఒడిదుడుకుల మధ్య రహదారిపై ప్రయాణించడం నరకంగా ఉందంటూ ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి రహదారి పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
దయనీయంగా తాళ్లపాక-హత్యరాల పర్యటక రహదారి - kadapa rajampeta roads problems
రాజంపేట చెక్‌పోస్టు రోడ్డు అస్తవ్యస్తంగా మారింది. 2009లో నిర్మించి నాటి నుంచి ఇప్పటికీ మరమ్మతులకు నోచుకోలేదు. ఆ దారి వెంబడి ప్రయాణించాలంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తాళ్లపాక-హత్యరాల పర్యటక రహదారి దయనీయం