కడపలో జోరుగా ప్రచారం
కడపలో పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వైకాపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అంజాద్ భాషా ఇంటింటికీ తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. స్వతంత్ర అభ్యర్థి, వ్యాపారవేత్త సలావుద్దీన్ ప్రచారం కొనసాగిస్తున్నారు.
కడపలో జోరుగా ప్రచారం
ఇదే నియోజకవర్గం నుంచిస్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్న వ్యాపారవేత్త సలావుద్దీన్.. ప్రచారం కొనసాగిస్తున్నారు. "ఇప్పటివరకు పార్టీలను గెలిపించారు... ఒక్క సారి స్వతంత్ర అభ్యర్థిని గెలిపించండి" అని ప్రజలను కోరారు. కడపలో పేరుకుపోయిన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.