గడిచిన ఐదేళ్లలో జిల్లా వ్యాప్తంగా గుట్కా తరలింపుపై ఉక్కుపాదం మోపినట్లు SP అన్బురాజన్ తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ముమ్మరంగా దాడులు చేసి.. పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
కర్ణాటక, ఇతర ప్రాంతాల నుంచి తీసుకువస్తున్న గుట్కాపై జిల్లా సరిహద్దుల్లో పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచి స్వాధీన పర్చుకున్నట్లు వెల్లడించారు. పదే పదే గుట్కా విక్రయిస్తూ దొరికిన వారిపై పీడీయాక్ట్ నమోదు చేశామని చెప్పారు.
ఐదేళ్లలో కేసుల వివరాలు ఇలా ఉన్నాయి..
- 2017లో ఒక కేసు నమోదు.. రూ.29, 20,7806, విలువచేసే 65,050 గుట్కా ప్యాకెట్లను స్వాధీనం.
- 2018లో 14 కేసులు నమోదు.. 60 మందిని అరెస్టు, రూ.29,27,984 విలువచేసే 4,00,020 గుట్కా ప్యాకెట్ల స్వాధీనం.
- 2019లో 134 కేసులు నమోదు.. 280 మందిని అరెస్టు, రూ.54,48,844 విలువచేసే 4,11,260 గుట్కా ప్యాకెట్లు స్వాధీనం.
- 2020లో 243 కేసులు నమోదు.. 570 మందిని అరెస్టు, రూ.89,45,941 విలువచేసే 7,10,100 గుట్కా ప్యాకెట్లు స్వాధీనం.
- 2021 జూన్ వరకు 182 కేసులు నమోదు.. 366 మంది అరెస్టు, రూ.59,39,850 విలువచేసే 3,36,025 గుట్కా ప్యాకెట్ల స్వాధీనం.