కరోనా వ్యాప్తి నియంత్రణకు కడప పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. డీఎస్పీ కార్యాలయం వద్ద... 'మాస్కు లేనిదే అనుమతి లేదంటూ' సూచిక బోర్డు ఏర్పాటు చేశారు. అలాగే కార్యాలయంలోకి వచ్చే వారికి థర్మల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మాస్క్ లేకుండా తిరిగితే రూ. 500 జరిమానా పోలీసులు విధిస్తున్నారు.
'మాస్క్ లేనిదే కార్యాలయంలోకి అనుమతి లేదు' - కడప పోలీసుల కరోనా నియంత్రణ చర్యలు
కరోనా విజృంభణ కొనసాగుతున్నందున కడప పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. డీఎస్పీ కార్యాలయం వద్ద 'మాస్క్ లేనిదే అనుమతి లేదంటూ' బోర్డు ఏర్పాటు చేశారు.

మాస్క్‌లపై అవగాహన కల్పిస్తోన్న కడప పోలీసులు