case on cbi officer: వైయస్ వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారిపై కేసు నమోదైంది. పులివెందులకు చెందిన ఉదయ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు మేరకు కడప రిమ్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ పేరుతో సీబీఐ అధికారి రామ్ సింగ్ వేధిస్తున్నారని కడప కోర్టులో ఉదయ్ కుమార్ పిటిషన్ వేశారు. కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ అధికారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
case on cbi officer: వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్...సీబీఐ అధికారిపై కేసు - ys viveka murder case latest updates
19:03 February 22
సీబీఐ అధికారిపై కేసు నమోదు చేసిన కడప రిమ్స్ పోలీసులు
ఫిబ్రవరి 15న ఫిర్యాదు...
సీబీఐ తనని వేధిస్తుందంటూ కేసులో అనుమానితుడిగా ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డి కడప అదనపు ఎస్పీని ఫిబ్రవరి 15న కలిశారు. ఈ మేరకు సీబీఐ అధికారులపై ఫిర్యాదు చేశారు. వివేకా హత్య కేసులో తనకు తెలిసిన విషయాలు చెప్పినా పట్టించుకోవట్లేదని.. వాళ్లు చెప్పినట్లు వినాలని వేధిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనని మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పెడుతున్నట్లు ప్రస్తావించారు.
ఇదీ చదవండి:YS Viveka Murder Case: 20 ఎకరాల భూమి ఇస్తామన్నారు.. వెలుగులోకి దస్తగిరి వాంగ్మూలం!