కడప జిల్లా రైల్వేకోడూరులో అక్రమంగా రవాణా చేస్తున్న ఎర్రచందనం దుంగలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ. రెండున్నర లక్షలకుపైనే ఉంటుందని తెలిపారు. స్మగ్లింగ్‌కు పాల్పడ్డ ఐదుగురిని అదుపులోకి తీసున్నారు. మరో ఐదురుగు పారిపోయారని ఎర్రచందనం యాంటీ స్మగ్లింగ్ టాస్క్‌ఫోర్స్ పోలీస్ ఇన్స్పెక్టర్ వెంకట్ రవి తెలిపారు.
RED SANDLE: రూ.2 లక్షల విలువైన ఎర్ర చందనం పట్టివేత - ఎర్ర చందనం స్మగ్లింగ్
కడప జిల్లా రైల్వేకోడూరులో ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్ చేస్తున్న ఐదుగురిని పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2 లక్షలకు పైగా విలువ చేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. మరో ఐదుగురు నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
RED SANDLE
దేశెట్టిపల్లె అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించామన్నారు. పారిపోయిన వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. పట్టుబడిన ఐదుగురు రైల్వేకోడూరు, వెంకటగిరి ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించామన్నారు.
ఇదీ చదవండి:రూ.7.20 లక్షల విలువైన రేషన్ బియ్యం పట్టివేత