ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇద్దరు బడా ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్! - kadapa district latest news

కడప జిల్లా పోలీసులు ఇద్దరు బడా ఎర్రచందనం స్మగ్లర్లను బెంగళూరులో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారిద్దరినీ కడపకు తరలించినట్లు తెలిసింది.

Redsandle Smuglers
Redsandle Smuglers

By

Published : Nov 30, 2020, 8:47 PM IST

ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లను కడప జిల్లా పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. స్మగ్లర్ బాషాభాయ్ అరెస్టు అయినప్పటి నుంచి మూడు ప్రత్యేక బృందాలు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో నిఘా పెట్టాయి. ఈ క్రమంలో బెంగళూరులో ఇద్దరు బడా స్మగ్లర్లను జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరద్దరూ కడప జిల్లాకు చెందిన వారని తెలిసింది.

నిందితులిద్దరినీ కడపకు తరలించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఆ ఇద్దరు బడా స్మగ్లర్లపై కడప, మైదుకూరు, రైల్వేకోడూరు ప్రాంతాల్లోని పోలీసు స్టేషన్లలో కేసులు ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ABOUT THE AUTHOR

...view details