ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హత్య కేసు ఛేదన... కుమారుడు, కోడలు అరెస్టు - kadapa district crime

కన్న తండ్రిని హత్య చేసిన కొడుకు, కోడల్ని కడప పోలీసులు అరెస్టు చేశారు. ప్రమాదవశాత్తు మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు... విచారణ చేయగా హత్య విషయం తెలియడంతో వారిని అరెస్టు చేసినట్లు జిల్లా అదనపు ఎస్పీ దేవ ప్రసాద్ వెల్లడించారు.

kadapa police chased murder case
హత్య కేసు ఛేదన... కుమారుడు, కోడలు అరెస్టు

By

Published : Jun 24, 2021, 10:27 PM IST

కడప జిల్లా ఖాజీపేట మండలం మల్లయ్యపల్లె గ్రామానికి చెందిన గువ్వల అంకిరెడ్డి... తన కుమారుడు చంద్రశేఖర్ రెడ్డి వద్ద నివాసముంన్నారు. వయోభారంతో ఇబ్బంది పడుతున్న అంకిరెడ్డిని అడ్డుగా భావించిన చంద్రశేఖర్ రెడ్డి, అతని భార్య రమాదేవి... కోపంతో బలంగా తోసేశారు. తలకు బలమైన గాయం కావడంతో... అంకిరెడ్డి అదే సమయంలో మృతి చెందాడు. ఈ ఘటనతో ఆందోళన చెందిన చంద్రశేఖర్ రెడ్డి, రమాదేవి అంకిరెడ్డి మృతదేహాన్ని ఇంటివెనుక పూడ్చి పెట్టారు.

కొద్ది రోజులు తర్వాత దుర్వాసన రావడాన్ని గమనించిన స్థానికులు... పోలీసులకు సమాచారం ఇచ్చారు. గ్రామానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీశారు. అంకిరెడ్డి హత్య గురించి చంద్రశేఖర్ రెడ్డి, రమాదేవిని విచారించగా... నేరం చేసినట్లు వారు అంగీకరించారు. వారిని అరెస్టు చేసినట్లు అదనపు ఎస్పీ దేవప్రసాద్ వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details