ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తప్పిపోయిన బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు - కడపలో తప్పిపోయిన బాలుడు న్యూస్

తప్పిపోయిన బాలుడుని గుర్తించిన కడప పోలీసులు...గంట వ్యవధిలోనే తల్లిదండ్రులకు అప్పగించారు. కడప రవీంద్ర నగర్​లోని ఓ మసీదు వద్ద ఒంటరిగా ఏడుస్తూ కనిపించిన బాలుడిని పోలీసులు స్టేషన్​కు తరలించారు. బాలుడి ఆచూకీ కోసం వెతుకుతూ పోలీసు స్టేషన్​కు వచ్చిన తల్లిదండ్రులకు బాబును అప్పగించారు.

తప్పిపోయిన బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు
తప్పిపోయిన బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు

By

Published : Nov 17, 2020, 3:41 PM IST

కడప తాలూకా పోలీస్​ స్టేషన్ పరిధిలో తప్పిపోయిన బాలుడుని గుర్తించిన పోలీసులు.. గంట వ్యవధిలోనే తల్లిదండ్రులకు అప్పగించారు. రాజంపేటకు చెందిన షేక్ ఖాదర్​బాషా, షేక్ సాదియ దంపతులు తమ రెండేళ్ల కుమారుడితో కలిసి పని నిమిత్తం కడప రవీంద్ర నగర్​కు వచ్చారు. కాగా...బాలుడు ఉన్నట్లుండి కనిపించకుండా పోయాడు.

ఓ మసీదు వద్ద ఏడుస్తూ కనిపించిన బాలుడిని గుర్తించిన బ్లూ కోర్ట్స్ పోలీసులు..చుట్టుపక్కల వారిని విచారించారు. అనంతరం తాలూకా పోలీస్ స్టేషన్​కు తీసుకువచ్చారు. కొద్దిసేపటికి తల్లిదండ్రులు బాలుడి కోసం వెతకటం ప్రారంభించి పోలీస్ స్టేషన్​కు వచ్చారు. అక్కడ బాలుడు కనిపించడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు విచారించి బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు.

ABOUT THE AUTHOR

...view details