ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సంప్రదాయ దుస్తుల్లో.. పోలీసుల సంక్రాంతి సంబరాలు - pongal celebrations in kadapa police station

వారందరూ రక్షకభటులు... 24 గంటలు ప్రజలకు రక్షణ కల్పించడంలో నిమగ్నమవుతుంటారు. ప్రజలంతా పండగ సంబరాల్లో మునిగి తెలుతున్న వేళ.. పోలీసులు మాత్రం విధుల్లోనే సమయం గడిపేస్తుంటారు. కడప జిల్లా పోలీసులు మాత్రం.. విధి నిర్వహణలో వినూత్నంగా వ్యవహరించారు. ఖాకీ యూనిఫారం పక్కన పెట్టి సంప్రదాయ దుస్తుల్లో విధులకు హాజరయ్యారు. ప్రజలతో పాటుగా సంక్రాంతి సంబరాలు చేసుకున్నారు.

kadapa police celebrates pongal in formal dresses
సంప్రదాయ దుస్తుల్లో సంక్రాంతి సంబరాలు జరుపుకున్న పోలీసులు

By

Published : Jan 14, 2021, 4:20 PM IST

సంప్రదాయ దుస్తుల్లో సంక్రాంతి సంబరాలు జరుపుకున్న పోలీసులు

కడప జిల్లా పోలీసులు సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకున్నారు. జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఆదేశానుసారం ఖాకీ దుస్తులను పక్కన పెట్టి సంప్రదాయ దుస్తులు ధరించి విధులకు హాజరయ్యారు. తెల్లని చొక్కా, పంచ, కండువా ధరించి... ఒకరికొకరు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. పండగ కళ ఉట్టిపడేలా.. స్టేషన్ ఆవరణలో ముగ్గులు వేయించారు.

ఎస్పీ అన్బురాజన్​ను మర్యాద పూర్వకంగా కలసి పుష్పగుచ్ఛాలు అందజేసి... సరదాగా గడిపారు. పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. చాలా కాలానికి తాము కూడా ప్రజలతో పాటు సంక్రాంతి పండగ చేసుకున్నామని పోలీసులు ఆనందం వ్యక్తం చేశారు. సంప్రదాయ దుస్తులు ధరించడం సంతోషంగా ఉందన్నారు.

ABOUT THE AUTHOR

...view details