కడప నుంచి తమిళనాడు, కర్నాటకకు.. ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్న అంతర్జాతీయ స్మగ్లర్ సింపతి ఫక్రుద్దీన్తో పాటు.. మరో 11 మందిని కడప పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలోని రాజంపేట, లక్కిరెడ్డిపల్లె, రామాపురం ప్రాంతాల్లో దాడులను నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ అన్బురాజన్ పేర్కొన్నారు. వీరి నుంచి 550 కిలోల ఎర్రచందనం దుంగలు, 3 వాహనాలు, మూడు ద్విచక్ర వాహనాలు,గొడ్డళ్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
ఎర్రచందనం అంతర్జాతీయ స్మగ్లర్ అరెస్ట్ - ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్ తాజా న్యూస్
కడప నుంచి తమిళనాడు, కర్నాటకకు ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్న 12 మంది స్మగ్లర్లను కడప పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 550 కిలోల ఎర్రచందనం దుంగలు, 3 వాహనాలు, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు కడప ఎస్పీ అన్బురాజన్ తెలిపారు.
అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్
సింపతి ఫకృద్ధీన్ 61 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. అతడు తమిళనాడు నుంచి కూలీలను తీసుకొచ్చి ఎర్రచందనాన్ని అక్రమంగా బెంగళూరుకు తరలిస్తూ.. సొమ్ము చేసుకుంటున్నట్లు ఎస్పీ తెలిపారు. అందుకోసం జిల్లాలో ప్రత్యేకంగా ముఠాలను ఏర్పాటు చేశాడని అన్నారు. అతనిపై పీడీ యాక్టు నమోదు చేస్తామని ఎస్పీ వెల్లడించారు.