ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అధికార పక్షం అడ్డుకోగలదా గాలివేగాన్ని?

అది ప్రతిపక్షనేత అడ్డా... ఆయన పోటీ చేయటం ఇప్పుడు రెండోసారి.. ఆ స్థానంలో ఇన్నాళ్లూ గెలుపు ఆయన కుటుంబానిదే. అదే కడప జిల్లా పులివెందుల. వైఎస్ ఫ్యామిలీకి కేరాఫ్​గా ఉన్న ఆ స్థానంలో.. తెదేపా అభ్యర్థిగా ఈసారి ఐదోసారి పోటీకి దిగిన సతీష్ రెడ్డి పాగా వేసేనా..? లేక కిందటిసారి ఫలితమే పునరావృతమయ్యేనా..? పులివెందుల పోరులో ఫలితం ఎలా ఉండబోతోంది?

పులివెందులలో పాగా వేసేదెవరు..?

By

Published : Mar 31, 2019, 12:02 PM IST

Updated : Apr 8, 2019, 8:41 AM IST

పులివెందులలో పాగా వేసేదెవరు..?
పులివెందుల... వైఎస్ కుటుంబానికి అడ్డాగా ఉన్న ఇక్కడ.. మరోసారి అలాంటి ఫలితమే రాబోతోందా..? ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ సీటు మాత్రం వైఎస్ కుంటుంబం ఖాతాలో చేరాల్సిందేనా..? రెండోసారి బరిలో ఉన్న జగన్ విజయం ఖాయమా..? లేక వైఎస్ కంచుకోట బీటలువారుతుందా..? కృష్ణా జలాలు తీసుకొచ్చి అభివృద్ధి చేసిన తనే గెలుస్తానన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు సతీష్‌ రెడ్డి. అటు.. పట్టు సడలించేదిలేదంటోంది ఫ్యాన్ పార్టీ. ఎన్నికల వేళ మారుతున్న కడప జిల్లా పులివెందుల తాజా రాజకీయ పరిణామాలపై ప్రత్యేక కథనం.

వైఎస్ కుటుంబమే....11/15

పులివెందుల నియోజకవర్గానికి ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు జరిగితే అత్యధికంగా గెలిచింది వై.ఎస్ కుటుంబ సభ్యులే. 1962లో స్వతంత్ర అభ్యర్థిగా సి. బాలిరెడ్డి... అనంతరం 3 సార్లు కాంగ్రెస్ అభ్యర్థి పెంచికల బసిరెడ్డి విజయం సాధించారు. మిగిలిన అన్ని ఎన్నికల్లో వై.ఎస్ కుటుంబ సభ్యులే గెలుస్తూ వచ్చారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పులివెందుల నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలవగా... 1991 ఎన్నికల్లో వైఎస్ బాబాయి వైఎస్ పురుషోత్తం రెడ్డి గెలిచారు. 2009 ఎన్నికల అనంతరం రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత విజయమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో వైకాపా అధినేత జగమ్మోహన్ రెడ్డి పోటీ చేసి భారీ మెజార్టీ సాధించారు. మరోసారి ఈ ఎన్నికల్లో గెలిచి తమకు తిరుగులేదు అని నిరూపించుకునేందుకు సిద్ధమయ్యారు.

ఐదోసారి బరిలో సతీశ్ రెడ్డి...

పులివెందుల నియోజకవర్గంలో ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ ఒక్కసారీ గెలవలేదు. తెదేపా అభ్యర్థిగా 1999, 2004 , 2009 ఎన్నికల్లో పోటీ చేసిన సతీష్ రెడ్డి ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో జగన్ చేతిలో ఓటమి పాలయ్యారు. మళ్లీ ఈసారి తెదేపా అభ్యర్థిగా సతీశ్​రెడ్డినే బరిలో నిలిపారు. ఈసారి మాత్రం విజయం పక్కా అనే ధీమాతో ఉన్నారు. 40 ఏళ్లలో వైఎస్ కుటుంబం పులివెందులకు కృష్ణా జలాలు తీసుకురావటంలో విఫలమైయిందని.. ఆ విషయంలో తెదేపా విజయం సాధించిందని స్పష్టం చేస్తున్నారు. నీరు రాకతో నియోజకవర్గంలోని రైతులు సంతోషంగా ఉన్నారని... సాగు, తాగు నీటికి సమస్య లేకుండా చేశామంటున్న సతీష్‌ రెడ్డి ఈ దఫా తెదేపా జెండా ఎగరేయటం ఖాయమంటున్నారు.

ప్రధాన పోటీ వైకాపా-తెదేపాల మధ్యే

2 లక్షల 12 వేల మంది ఓట్లు ఉన్న పులివెందుల నియోజకవర్గంలో... పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లో తెదేపాకు 50 వేలకు పైగా ఓట్లు వస్తున్నాయి. ఈసారి గెలుపునకు అవకాశం ఉందని పసుపుదళం ఆశాభావంతో ఉంది. పులివెందుల ప్రజలు మాతోనే ఉంటారని వైకాపా ధీమాతో ఉంది. నియోజకవర్గంలో కాంగ్రెస్, జనసేన ఇతర పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేసినా పోటీ మాత్రం వైకాపా, తెదేపా మధ్యనే ఉండనుంది.

Last Updated : Apr 8, 2019, 8:41 AM IST

ABOUT THE AUTHOR

...view details