ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చెత్త పన్ను పెంపుపై ప్రజల ఆగ్రహం - చెత్త పన్ను పెంపుపై ప్రజల ఆగ్రహం

చెత్త పన్ను పెంచడంపై.. సీఎం జగన్ సొంత జిల్లాలోనే ప్రజల నుంచి ప్రతిఘటన ఎదురవుతోంది. గత్యంతరం లేని స్థితిలో..కడప వైకాపా కార్పొరేటర్లు ప్రజలకు మద్దతు నిలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పన్ను వసూలుపై సిబ్బంది అవగాహన లేకుండా వ్యవహరించారంటూ.. వారిపైకి నెట్టారు.

kadapa people fires on municipal staff over increasing Garbage tax
చెత్త పన్ను పెంపుపై ప్రజల ఆగ్రహం

By

Published : Jul 24, 2022, 12:12 PM IST

చెత్త పన్ను పెంపుపై ప్రజల ఆగ్రహం

చెత్త పన్నుపై ప్రజల నుంచి ఎదురైన ఎదురైన ప్రశ్నలివి. అధికారులు, సిబ్బంది పన్ను వసూలు చేసేందుకు వెళ్లగా.. జనం ససేమీరా అన్నారు. చెత్తపన్నుపై రాష్ట్రమంతా ఇదే స్థాయిలో వ్యతిరేకత ఉన్నా.. ఈ దృశ్యాలు స్వయానా సీఎం సొంత జిల్లాలోవే.

కడప నగరాన్ని నాలుగు జోన్ల కింద విభజించి.. కొన్ని ప్రాంతాల్లో ఒక్కో ఇంటికి నెలకు 90, మరికొన్ని కాలనీలకు 40 రూపాయల చొప్పున.. చెత్తపన్ను వసూలు చేస్తున్నారు. నాలుగైదు రోజులకోసారి చెత్త సేకరణకు ఆటోలు వస్తున్నా.. పన్ను పెంచడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. ఇంటింటా పన్ను వసూలుకు శనివారం చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో..సిబ్బందిపై జనం తిరగబడ్డారు. చెల్లింపులకు మహిళలు నిరాకరించడంతో.. చాలా కాలనీల్లో వాగ్వాదాలు జరిగాయి.

వైకాపా కార్పొరేటర్లు ఈ వ్యవహారం పార్టీకి ఇబ్బందికరమనుకుని అప్రమత్తమయ్యారు. చెత్తపన్ను వసూలు తాత్కాలికంగా నిలుపుదల చేయాలంటూ..మేయర్ సురేష్ బాబు, కమిషనర్‌కు లిఖిత పూర్వకంగా కోరారు. అధికారులు అవగాహన లోపంతో వ్యవహరించారని కార్పొరేటర్లు చెబుతున్నారు. చెత్తపన్ను అంశంపై వచ్చేనెల 4న సర్వసభ్య సమావేశంలో నిర్ణయించాలని కమిషనర్ అన్నట్లు కార్పొరేటర్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details