ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

flood in burial ground: శ్మశానవాటికంతా నీళ్లు.. అందులోనే మృతదేహం పూడ్చివేత! - Funerals

people facing problems: కుటుంబ సభ్యుడు చనిపోయిన బాధకన్నా.. అతడి మృతదేహాన్ని ఎక్కడ, ఎలా పూడ్చాలో తెలియక అవస్థ పడే పరిస్థితి వచ్చింది కడప జిల్లా వాసులకు. ఇందుకు కారణం.. ఇటీవల కురిసిన భారీ వర్షాలే. శ్మశానవాటికలో ఎక్కడ గొయ్యి తీసినా నీళ్లే వస్తున్నాయి.

KADAPA PEOPLE FACING PROBLEMS DUE TO FLOODS IN BURIAL GROUND
శ్మశానవాటికంతా నీళ్లు.. అందులోనే మృతదేహం పూడ్చివేత!

By

Published : Dec 1, 2021, 9:17 AM IST

problems for funerals: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు.. మనిషి బతికున్నప్పుడే కాదు చనిపోయాక కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కడప జిల్లా కేంద్రంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. అతడికి అంత్యక్రియలు చేసేందుకు.. మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకువెళ్లారు. కానీ అంతిమ సంస్కారాలు చేసేందుకు బంధువులు, కుటుంబ సభ్యులు నానా ఇబ్బందులు పడ్డారు. మృతదేహాన్ని ఖననం చేసేందుకు శ్మశాన వాటికలో ఎక్కడ గుంత తవ్వినా.. నీరు పైకి ఉబికి వచ్చింది. అలా ఐదారు చోట్ల తవ్వి చూసినా ఫలితం లేకుండాపోయింది. శ్మశాన వాటిక మొత్తం చెరువులా తయారైంది. ఇక చేసేదేం లేక మృతదేహాన్ని నీటిలోనే పూడ్చిపెట్టాలని నిర్ణయానికొచ్చారు.

ట్రాక్టర్​ సాయంతో మట్టి పూడుస్తున్న గ్రామస్థులు

నీటిలోనే.. పూడ్చి పెట్టేశారు!

పొక్లెయిన్ సాయంతో.. నీళ్లలోనే గుంత తీయించారు. మృతదేహాన్ని నీటిలో అదిమి పట్టుకొని దానిపై ట్రాక్టర్ల సాయంతో మట్టి వేయించారు. దాదాపు రెండు ట్రాక్టర్ల మట్టి వేసి మృతదేహాన్ని కప్పి పెట్టారు. ఈ దృశ్యాలను చూసిన కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అంత్యక్రియలు ఇలా చేయాల్సి రావడం చాలా బాధగా ఉందని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. శ్మశాన వాటికలో మౌలిక వసతులు కల్పించాలని అధికారులను కోరారు.

మృతదేహాన్ని నీటిలోనే అదిమి పట్టుకున్న బంధువులు

ఇదీ చూడండి:

Women police murdered at dhone: మహిళా పోలీస్ దారుణ హత్య.. హంతకుడు ఎవరంటే..?

ABOUT THE AUTHOR

...view details