ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అధికారుల రావట్లేదు.. బురద కంపు పోవట్లేదు' - కడపలో నివర్ తుపాన్ ఎఫెక్ట్ వార్తలు

ఐదు రోజులుగా స్వచ్ఛంద సంస్థలు, దాతలు కడుపు నింపుతున్నారు గానీ.... అధికారులు ఎవ్వరూ తమ కాలనీల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని కడప బుగ్గవంక బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుగ్గవంక ప్రవాహానికి నీటమునిగిన పరివాహక కాలనీల్లో ఐదురోజులు దాటినా బురద దర్శనమిస్తూనే ఉంది. కడప బుగ్గవంక పరివాహక ప్రాంతం నాగరాజుపేట నుంచి ఈటీవీ - భారత్ ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు..

'అధికారుల రావట్లేదు.. బురద కంపు పోవట్లేదు'
'అధికారుల రావట్లేదు.. బురద కంపు పోవట్లేదు'

By

Published : Dec 1, 2020, 3:33 PM IST

'అధికారుల రావట్లేదు.. బురద కంపు పోవట్లేదు'

నివర్ తుపాను ప్రభావంతో కడప బుగ్గవంక బాధిత గ్రామాల్లో బురద అలానే ఉంది. దుర్గంధం వెదజల్లే స్థితిలో ఇరుకు వీధుల్లో కాలం వెల్లదీస్తున్నారు స్థానికులు. ఇంట్లో ధాన్యం మొత్తం తడిసి పోవడంతో దాతలు పంపించే భోజనం ప్యాకెట్ల కోసం బాధితులు ఎదురు చూస్తున్నారు. వస్తుసామగ్రి మొత్తం నీళ్లలో కొట్టుకుపోయి.. కట్టుబట్టలతో మిగిలారు. కనీసం ఇంటిముందు నిలిచిన చెత్త, బురదను తొలగించడానికి కూడా మున్సిపల్ అధికారులు రావడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులు ఓట్ల కోసం ప్రతిగడప తిరుగుతారు... ఇలాంటి సమయంలో మాత్రం కనిపించరనే ఆక్రోశం బాధితుల్లో వ్యక్తం అవుతోంది.

ABOUT THE AUTHOR

...view details