కడప పెద్ద దర్గా నేడు పునః ప్రారంభించారు. ప్రభుత్వం మార్గదర్శకాలను పాటిస్తూ నిర్వాహకులు దర్గాను తెరిచారు. దర్గాకు వచ్చే వారి పేర్లను, చరవాణి నెంబర్లను నమోదు చేసుకుంటున్నారు. ప్రధాన ద్వారం వద్ద ఇద్దరు పీపీఈ కిట్లు ధరించి దర్గాలోకి వచ్చే వారి శరీర ఉష్ణోగ్రతను తనిఖీ చేసి లోనికి అనుమతిస్తున్నారు. ఆటోమేటిక్ శానిటైజర్ ద్వారా చేతులు శుభ్రం చేసుకుని దర్గాలో భౌతిక దూరం పాటిస్తూ పూజలకు భక్తులను అనుమతిస్తున్నారు. తీర్థప్రసాదాలను నిషేధించారు.
కడప పెద్ద దర్గా పునః ప్రారంభం - కడప వార్తలు
ప్రసిద్ధిగాంచిన కడప పెద్ద దర్గాను ఈరోజు పునః ప్రారంభించారు. లాక్ డౌన్ అనంతరం సుమారు 80 రోజుల తర్వాత పెద్ద దర్గాలోకి భక్తులకు అనుమతించారు.
దర్గా పునః ప్రారంభం