Suicide: అనంతపురం జిల్లా పుట్టపర్తి నగర పంచాయతీ కమిషనర్‌గా పనిచేస్తున్న ముని కుమార్.. కడప రాయచోటి రైల్వే గేటు వద్ద ఆత్మహత్యకు పాల్పడ్డారు. కడప జిల్లా ప్రకాష్ నగర్ కు చెందిన మునికుమార్.. కడప నగరపాలక కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహించేవారు. మూడు నెలల కిందట.. డిప్యూటేషన్ పై అనంతపురం పంచాయతీ కమిషనర్ గా వెళ్లారు. వారాంతపు సెలవుల్లో ఇంటికి వచ్చేవారని కుటుంబీకులు తెలిపారు.
ఈ నేపథ్యంలో.. ముని కుమార్ శుక్ర, శనివారం సెలవు పెట్టి గురువారం కడపకు వచ్చారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. అప్పుడప్పుడు తన స్నేహితులతో పని ఒత్తిడి ఎక్కువగా ఉందని చెప్పినట్లు సమాచారం.