అత్యాధునిక హంగులతో పార్టీ కార్యాలయ నిర్మాణం - srinivasulu reddy
కడప-చిత్తూరు జాతీయ రహదారి పక్కన పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం కేటాయించిన స్థలాన్ని... ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ వెంకటసుబ్బారెడ్డి, తెదేపా నాయకులతో కలిసి ఆ తెదేపా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి పరిశీలించారు.
కడప-చిత్తూరు జాతీయ రహదారి పక్కన అత్యాధునిక హంగులతో జిల్లా పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నామని తెదేపా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి చెప్పారు. పార్టీ కార్యాలయానికి గతేడాది 35 సంవత్సరాల లీజుకు రెండెకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించిందన్న శ్రీనివాసులు రెడ్డి... వచ్చే నెలలో పార్టీ అధినేత చంద్రబాబుతో గానీ... మంత్రి నారా లోకేశ్‌తో గానీ భూమిపూజ నిర్వహిస్తామని పేర్కొన్నారు. జాతీయ రహదారి పక్కన కావడంతో పార్టీ నాయకులు... కార్యకర్తలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. తొమ్మిది నెలల్లో కార్యాలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలిపారు.