ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తమిళనాడులో హత్యచేశారు.. రామాపురంలో చిక్కారు - కడప హత్య కేసు మిస్టరీ

తమిళనాడులో అదృశ్యమైన ఓ వ్యక్తి..కడప జిల్లాలో శవమై తేలాడు. అది కూడా సాదాసీదాగా కాదు. సాటి మనిషిని ఇలా కూడా చంపేస్తారా అనేంతలా కాళ్లు, చేతులు ముక్కలు చేశారు. పురుషాంగం కూడా కత్తిరించారు. అసలు కత్తికో కండగా నరకాల్సినంత కసి ఎవరికి ఉంటుంది? ఇంతకీ అతను చేసిన పాపమేంటి..? హంతకులు చేసిన ఘోరం ఏంటి..? తమిళనాడులో మొదలైన ఈ క్రైం కథకు కడప పోలీసులుఎలా ముగింపు పలికారు.?

kadapa murder case mystery  revealed
kadapa murder case mystery revealed

By

Published : Nov 25, 2020, 7:57 AM IST

Updated : Nov 25, 2020, 10:36 AM IST

నవంబర్ 18..! కర్నూలు- కడప జాతీయ రహదారిలో వాహనాలు వస్తూవెళ్తూ ఉన్నాయి. ఓ కారు..కడప జిల్లా రామాపురం మండలం నల్లగుట్టపల్లి వద్ద ఆగింది. హైవే దిగి కొంచెం లోపలికి వచ్చింది. కారులో నుంచి కొందరు వ్యక్తులు కిందకు దిగారు. అటూ ఇటూ చూసి ఓ మూటఅక్కడ పడేశారు. వచ్చినదారినే వెళ్లిపోయారు. దూరం నుంచి గమనించిన పశువుల కాపరులు పోలీసులకు ఫోన్‌ చేశారు. అక్కడికెళ్లిన పోలీసులు మూట విప్పిచూశారు. అందులో.. మృతదేహాం ఉంది. కత్తికో కండ అన్నట్లు.. కాళ్లు, చేతులు ముక్కలు ముక్కలుగా నరికేసి ఉంది. ఊరు,పేరులేని శవం ఆచూకీ కనుక్కోవడం పోలీసులకు సవాల్‌గా మారింది.

ఏ కేసులోనైనా పోలీసులకు క్లూ దొరికేది సీసీ ఫుటేజ్‌..! శవాన్ని తెచ్చిపడేసిన కారు ఎవరిదో, ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు పోలీస్‌ బృందాలు రంగంలోకి దిగాయి. పశువుల కాపరులు చెప్పిన సమాచారం ఆధారంగా గువ్వల చెరువు,బండపల్లి టోల్ ప్లాజాల్లోని సిసీఫుటేజిని పరిశీలించారు. మృతదేహాం పడేసిన స్థలంలో సెల్‌సిగ్నల్స్‌నూ పరిశీలించారు. ఇక అక్కడ తీగ లాగితే.. డొంక తమిళనాడులో కదిలింది. మృతదేహం కడలూరుకు చెందిన వినోద్‌కుమార్‌దని కడప పోలీసులు గుర్తించారు. కడలూరుకు చెందిన వెంకటేషన్‌ను అరెస్టు చేశారు.

వినోద్‌కుమార్‌ను అంతలా నకాల్సిన అవసరం ఏమొచ్చిందనే కోణంలోవిచారణ సాగించిన కడప జిల్లా పోలీసులు కారణం తెలుసుకుని నిర్ఘాంతపోయారు. వెంకటేషన్‌కు, మరో యువతికి పెళ్లి నిశ్చయమైంది. ఐతే..వినోద్ కుమార్‌కు సదరు యువతితో గతంలో పరిచయం ఉంది. ఇద్దరూ సన్నిహితంగా ఫోటోలూ దిగారు. వినోద్‌కుమార్‌ వాటితో.. వెంకటేషన్‌ సహా యువతి కుంటుబాన్నీ బ్లాక్‌మెయిల్ చేశాడు. కాబోయే దంపతుల జీవితం నాశనం కాకుండా ఉండాలంటే వినోద్‌ను అంతమొందించాలని భావించారు. పెళ్లి కుమారుడు వెంకటేషన్, అతని తండ్రి, అమ్మాయి తండ్రి, బావ కలిసి ప్రణాళిక వేశారు. నేరాలు చేయడంలో సిద్ధహస్తుడైన దిల్లీ బాబు సాయంతో వినోద్‌ను కిడ్నాప్ చేశారు. 17వ తేదీ అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి.. కాళ్లు, చేతులు నరికారు. బెదిరింపులను గుర్తుకు తెచ్చుకుని వినోద్‌కుమార్‌ పురుషాంగం కూడా నరికేశారు.

పెళ్లిపీటలు ఎక్కాల్సిన వెంకటేషన్‌ను రాయచోటి పోలీసులు అరెస్టు చేయగా ఇంకోనలుగురు నిందితులు తమిళనాడు కోర్టులో లొంగిపోయారు. వారినీ పీటీ వారంట్ కింద కడపకు తెచ్చి మరిన్ని వివరాలు రాబట్టనున్నారు. తమిళనాడు నుంచి కడప వరకు వాహనాల తనిఖీల్లో ఎవరూ శవాన్ని గుర్తించకుండా ఎలా జాగ్రత్త పడ్డారనేది తెలుసుకోనున్నారు.

తమిళనాడు హత్యకేసు మిస్టరీ

ఇదీ చదవండి: అతి తీవ్ర తుపానుగా 'నివర్'.. నేడు తీరం దాటే అవకాశం

Last Updated : Nov 25, 2020, 10:36 AM IST

ABOUT THE AUTHOR

...view details