కడప నగరపాలక సంస్థ పరిధిలో పనిచేసే మున్సిపల్ కార్మికులను... గ్రామ సచివాలయాలకు పంపించాలని కమిషనర్ తీసుకున్న నిర్ణయంపై కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. కమిషనర్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ... నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట కార్మికులు అర్ధనగ్నంగా ఆందోళన చేపట్టారు.
నగరపాలక సంస్థ తొలి సర్వసభ్య సమావేశం జరగుతుండగా.. కార్మికులు నిరసనకు దిగారు. నగరానికి అవసరమైన మున్సిపల్ కార్మికులు అందుబాటులో లేనప్పటికీ.. సిబ్బందిని పెంచకుండా గ్రామ సచివాలయాలకు ఎలా పంపిస్తారని వారు ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలోని లేని విధంగా.. కడప కార్పొరేషన్లో ఎలా అమలు చేస్తారని నిలదీశారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని కార్మికులు హెచ్చరించారు.