కడప నగర పాలక సంస్థ మేయర్ అభ్యర్థిగా సురేశ్ బాబు పేరు దాదాపు ఖరారయ్యింది. జిల్లా కేంద్రంలోని 50 డివిజన్లలో 48 కైవసం చేసుకున్న వైకాపా.. మేయర్ పీఠాన్ని రెండోసారి సురేశ్‌కే కట్టబెట్టనుంది. ఆయన.. నాలుగో డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా ఏకగ్రీవంతో ఎన్నికయ్యారు. ఈ నెల 18న మేయర్, పుర చైర్మన్ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించనున్నారు. కడప కార్పొరేషన్ మేయర్ స్థానం బీసీకి రిజర్వ్ అవ్వటంతో.. సురేశ్ పదవి దక్కించుకోనున్నారు.
కడప నగరపాలక సంస్థ మేయర్ అభ్యర్థిగా సురేశ్‌బాబు! - Kadapa Municipal Corporation mayor candidate news
కడప నగరపాలక సంస్థ మేయర్ అభ్యర్థిగా సురేశ్‌బాబు పేరు ఖరారు అయ్యింది. నాలుగో డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా ఏకగ్రీవంతో ఎన్నికైన ఆయన.. రెండోసారి మేయర్ పీఠాన్ని దక్కించుకోనున్నారు.
కడప మేయర్ అభ్యర్థిగా సురేశ్‌బాబు