కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో... కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పర్యటించారు. దాదాపు రూ. 64 కోట్లతో నిర్మిస్తున్న వివిధ భవనాలకు శంకుస్థాపనలు చేశారు. అందులో భాగంగానే చక్రాయపేట మండలంలో జూనియర్ కళాశాల భవనం, గండి గురుకుల పాఠశాలలో వసతి భవనాలు, జెడ్పీ బాలుర పాఠశాల, రైతు భరోసా గోడౌన్ భవనాలకు శంకుస్థాపన చేశారు.
పులివెందులలో పర్యటించిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి - కడప జిల్లా వార్తలు
కడప జిల్లా పులివెందులో కడప ఎంపీ పర్యటించారు. నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.
పులివెందులలో పర్యటించిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి
వేంపల్లి మండలంలో రూ.24.80 కోట్ల వ్యయంతో జెడ్పీ బాలుర, బాలికల నూతన పాఠశాల, రూ.1.20 కోట్లతో ఫైర్ స్టేషన్, రూ. 4.56 కోట్లతో నిర్మిస్తున్న ఉర్దూ మాధ్యమం జూనియర్ కళాశాల, రూ.7.39 కోట్లతో పాలిటెక్నిక్ కళాశాలలోని అదనపు గదులు, రూ.1.72 కోట్లతో శిల్పారామం పార్క్‌లకు శంకుస్థాపన చేశారు.
ఇదీచదవండి.