ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సోమశిల ముంపు వాసులను రక్షించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది' - latest somasila Reservoir news in telugu

సోమశిల ముంపు వాసులకు వచ్చే ఏడాది నాటికి ఎలాంటి కష్టాలు లేకుండా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి అన్నారు. ముంపు వాసులకు పరిహారం... పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ కోరినట్లు తెలిపారు.

kadapa mp avinash reddy meet collector Harikiran

By

Published : Nov 1, 2019, 10:19 PM IST

సోమశిల ముంపు వాసులను రక్షించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది

సోమశిల వెనక జలాలతో ముంపునకు గురైన వారికి ఎలాంటి కష్టాలు లేకుండా చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కడప ఎంపీ వైఎస్​ అవినాశ్​ రెడ్డి అన్నారు. ముంపు ప్రాంతాలైన గోపవరం, అట్లూరు, ఒంటిమిట్ట మండలాల్లోని 15 గ్రామాలను ఆయన పరిశీలించారు. అనంతరం కడప జిల్లా కలెక్టర్ హరికిరణ్​ను కలిసి ముంపు వాసుల కష్టాలు తీర్చే విధంగా ప్రభుత్వానికి విన్నవించాలని మెమోరాండం అందజేశారు. చరిత్రలోనే తొలిసారిగా సోమశిల జలాశయంలో 78 టీఎంసీల నీటిని నిల్వచేశారని.... దాని ఫలితంగా కడప జిల్లాలోని కొన్ని గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని ఆయన గుర్తు చేశారు. సోమశిల జలాశయంలో కనీసం రెండు టీఎంసీలు తగ్గిస్తే ముంపు గ్రామాలకు కష్టాలు తీరుతాయనే విషయాన్ని జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లినట్లు అవినాశ్ రెడ్డి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details