కడప జిల్లా మైదుకూరు పురపాలికలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలకు ఎమ్మెల్యే రఘురారెడ్డి భూమిపూజ చేశారు. ఒక్కో భవనం రూ.80లక్షల వ్యయంతో నిర్మాణం చేయనున్నారు. భవన నిర్మాణాలకు అవసరమైన స్థలాన్ని శివపురంలో సర్పంచి కొండా భాస్కరరెడ్డి, చిన్నయ్యగారిపల్లెలో సిండికేట్ సొసైటీ మాజీ ఛైర్మన్ శ్రీమన్నారాయణరెడ్డిలు 20సెంట్లు చొప్పున ఉచితంగా ఇచ్చారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలకు ఎమ్మెల్యే రఘురారెడ్డి భూమిపూజ - ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు
మైదుకూరు పురపాలికలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలకు ఎమ్మెల్యే రఘురారెడ్డి భూమిపూజ చేశారు. భవన నిర్మాణాలకు శివపురంలో సర్పంచి కొండా భాస్కరరెడ్డి, చిన్నయ్యగారిపల్లెలో సిండికేట్ సొసైటీ మాజీ ఛైర్మన్ శ్రీమన్నారాయణరెడ్డిలు 20సెంట్లు చొప్పున స్థలాన్ని ఉచితంగా ఇచ్చారు.
ఎమ్మెల్యే రఘురారెడ్డి భూమిపూజ
వర్షాలతో ఇబ్బందులు పడకుండా త్వరితగతిన పునాదులు పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు. సరస్వతీపేట నుంచి శివపురం పట్టణ ఆరోగ్య కేంద్రం వరకు రహదారిని పురపాలక నిధులతోనే అభివృద్ధి చేసేలా ప్రతిపాదనలు తయారు చేస్తామని ఏఈ మధుసూదన్‌బాబు తెలిపారు.