కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా... కడప జిల్లాలో 28 లక్షల జనాభాకు మాస్కులు పంపిణీ చేసేలా అధికార యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక్కొక్కరికి మూడు మాస్కులు చొప్పున జిల్లాలో 84 లక్షల మాస్కులు పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో మెప్మా తరఫున, గ్రామీణ ప్రాంతాల్లో డీఆర్డీఏ తరఫున మాస్కులు తయారు చేయిస్తున్నట్లు మెప్మా పీడీ రామ్మోహనరావు తెలిపారు. రోజుకు లక్ష మాస్కులు తయారు చేస్తున్నామన్న ఆయన... వాటిని ఆయా మున్సిపాలిటీ కమిషనర్లకు అందజేస్తున్నామన్నారు. పెద్ద మొత్తంలో మాస్కులు తయారు చేస్తున్నా.. నాణ్యతలో ఎక్కడా రాజీ పడేది లేదంటున్న మెప్మా పీడీతో మా ప్రతినిధి ముఖాముఖి..!
జిల్లాలో ఒక్కొక్కరికి మూడు మాస్కులు పంపిణీ: మెప్మా పీడీ రామ్మోహన్ రెడ్డి - మాస్కులు తయారీ
కరోనా వ్యాప్తి నివారణకు కడప జిల్లా వ్యాప్తంగా ఒక్కొక్కరికి మూడు మాస్కులు పంపిణీ చేసేలా అధికారులు చర్యలు ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో డీఆర్డీఏ తరఫున, పట్టణాల్లో మెప్మా తరఫున మాస్కులు తయారు చేయిస్తున్నట్లు మెప్మా పీడీ రామ్మోహనరావు తెలిపారు. రోజుకు నాణ్యతతో కూడిన లక్ష మాస్కులు అందుబాటులోకి వస్తున్నాయని వివరించారు.
కడప మెప్మా పీడీ రామ్మోహన్ రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి