చిరు వ్యాపారులను ఆదుకోవడానికే 'జగనన్న తోడు' పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని కడప సంయుక్త కలెక్టర్ సాయికాంత్ వర్మ పేర్కొన్నారు. జమ్మలమడుగు పంచాయతీ కార్యాలయంలో డివిజన్ స్థాయి సమావేశాన్ని ఆయన నిర్వహించారు. 16 మండలాల ఎంపీడీవోలు, నాలుగు మున్సిపాలిటీల కమిషనర్లు, బ్యాంకు అధికారులు హాజరయ్యారు.
'జగనన్న తోడు'పై కడప జాయింట్ కలెక్టర్ సమీక్ష - చిరు వ్యాపారుల కోసం కడప జేసీ సమీక్ష
కరోనాతో కుదేలైన చిరు వ్యాపారులకు 'జగనన్న తోడు' ద్వారా సహాయం అందించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. బ్యాంకర్లు, అధికారులతో జమ్మలమడుగులో సమావేశమైన కడప సంయుక్త కలెక్టర్.. సాధ్యమైనంత త్వరగా ప్రక్రియను పూర్తి చేయాలని దిశా నిర్దేశం చేశారు.
!['జగనన్న తోడు'పై కడప జాయింట్ కలెక్టర్ సమీక్ష jc meet on jagananna thodu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9211664-657-9211664-1602934802198.jpg)
జగనన్న తోడుపై జేసీ సమీక్ష
కరోనా కారణంగా నష్టపోయిన చిన్నస్థాయి వ్యాపారులు ఆర్థికంగా బలపడటానికి బ్యాంకర్లు సహకరించాలని కోరారు. అధికారులు నిరంతరం బ్యాంకర్లతో చర్చిస్తూ.. దరఖాస్తులు పెండింగ్ లేకుండా చూడాలని ఆదేశించారు. రెండు రోజుల్లోనే రుణం ఆమోదించాలన్నారు.
ఇదీ చదవండి:కడప జిల్లాలో పోలీసుల ఆకస్మిక దాడులు