ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కరోనా నియంత్రణ చర్యల్లో ఉపాధ్యాయులు ఆదర్శంగా ఉండాలి' - కడప పాఠశాలల్లో కరోనా నియంత్రణ చర్యలు

కొవిడ్ నియంత్రణ పద్ధతులు పాటించడంలో ఉపాధ్యాయులు ఆదర్శంగా ఉండాలని కడప జేసీ సాయికాంత్ అన్నారు. పిల్లలు కరోనా నిబంధనలను పాటించేలా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని జేసీ అన్నారు.

kadapa jc srikanth on covid regulation actions in schools
kadapa jc srikanth on covid regulation actions in schools

By

Published : Oct 31, 2020, 10:38 PM IST

కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యలలో ఉపాధ్యాయులు పిల్లలకు ఆదర్శంగా ఉండాలని కడప జేసీ సాయికాంత్ వర్మ అన్నారు. పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం కడప జెడ్పీ ఆవరణలో కొవిడ్- 19 నియమ నిబంధనలపై సమావేశం ఏర్పాటు చేశారు. కొవిడ్ నియంత్రణ పద్ధతులు పాటించడంలో.. ఉపాధ్యాయులు కచ్చితంగా ఉండాలని జేసీ సూచించారు.

పక్కవారితో ఎలా నడుచుకోవాలి ? భౌతిక దూరం ఎలా పాటించాలి ? వ్యక్తిగత శుభ్రత వంటి అంశాలపై పిల్లలకు అవగాహన కల్పించాలని దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ విధి విధానాలను, మార్గదర్శకాలను తూచా తప్పక పాటించాలన్నారు.

ఇదీ చదవండి: పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే: సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details