ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాటు సారా స్థావరాలపై ఎన్​ఫోర్స్​మెంట్ అధికారుల దాడులు - ఓబులవారిపల్లె సారా న్యూస్

కడప జిల్లా ఓబులవారిపల్లి మండలంలో ఎన్ఫోర్స్​మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. నాటు సారా తయారీ చేస్తున్నవారినీ, విక్రయిస్తున్న వారినీ అరెస్టు చేశారు.

police raids on natusara manufacturing plant
నాటు సారా స్థావరాలపై ఎన్​ఫోర్స్​మెంట్ అధికారుల దాడులు

By

Published : Aug 12, 2020, 10:17 PM IST

కడప జిల్లా ఓబులవారిపల్లె మండలంలో స్పెషల్ ఎన్ఫోర్స్​మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. నాటు సారా అమ్ముతున్న కొండేటి సుబ్రమణ్యం, చెన్నూరు మణిలను అరెస్టు చేసి.. నిందితుల నుంచి 10 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

చిన్నంపల్లి పంచాయతీ, లింగిరెడ్డిపల్లి, అరుంధతీవాడ సమీపంలో జీమాను కుంట వద్ద.. నాటు సారా తయారు చేస్తున్న వర్ల నరసింహులు, వర్ల సుదర్శన్​లు 500 లీటర్ల బెల్లం ఊటతో పట్టుపడ్డారని తెలిపారు. వర్ల పెంచలయ్య అలియాస్ బుజ్జి అనే నిందితుడు పరారైనట్లు చెప్పారు.

నాటుసారా, అక్రమ మద్యం, ఇసుక అక్రమ రవాణా గురించి ప్రజలు 9440902597 కు ఫోన్​ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

మైదుకూరులో తెలంగాణ మద్యం స్వాధీనం

ABOUT THE AUTHOR

...view details