కడప జిల్లాలో కరోనా వైరస్ రోజురోజుకు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అన్బురాజన్ సూచించారు. కడప పోలీసు కార్యాలయం నుంచి జిల్లాలోని పోలీసులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విధులకు వెళ్లే పోలీసులు తప్పనిసరిగా మాస్కులు, గ్లౌజులు ధరించాలని చెప్పారు. ఫిర్యాదు దారులతో మాట్లాడే సమయంలో భౌతిక దూరం పాటించాలని సూచించారు. శానిటైజర్ తప్పనిసరిగా వాడాలన్నారు.
పోలీసులు తప్పనిసరిగా మాస్కులు, గ్లౌజులు ధరించాలి:ఎస్పీ అన్బురాజన్ - కడప ఎస్పీ తాజా వార్తలు
కడప జిల్లాలో కరోనా వైరస్ రోజురోజుకు పెరుగుతుండటంతో జిల్లా ఎస్పీ అన్బురాజన్ పోలీసులకు తగు సలహాలు సూచనలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు జాగ్రత్తలు చెప్పారు.
kadapa dst sp video conference with dst poilce about corona