ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనాతో మృతి.. ఖననాన్ని అడ్డుకున్న గ్రామస్థులు - కడప జిల్లా కరోనా వార్తలు

కరోనాతో మృతి చెందిన వారికి సరిగా అంత్యక్రియలు కూడా నిర్వహించలేని దారుణ పరిస్థితి నెలకొంది. అంత్యక్రియల విషయంలో స్థానికులు మానవత్వం మరచి ప్రవర్తిస్తున్నారు. తమ ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహించవద్దంటూ అడ్డుతగులుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కడప జిల్లా రాయచోటిలో వెలుగు చూసింది.

kadapa dst rayachoti villagers protest against funreal process of corona deadbody
kadapa dst rayachoti villagers protest against funreal process of corona deadbody

By

Published : Jul 25, 2020, 7:28 AM IST

కరోనా మహమ్మారికి గురై మరణించిన ఓ వ్యక్తి మృతదేహానికి అధికారులు నిర్వహిస్తున్న అంత్యక్రియలను కడప జిల్లా రాయచోటిలో స్థానికులు అడ్డుకున్నారు. గాలివీడు మండలం నూలివీడుకు చెందిన 50 ఏళ్ల వయసు కలిగిన ఓ మత ప్రబోధకుడు తీవ్ర అనారోగ్యంతో ప్రభుత్వాసుపత్రిలో గురువారం రాత్రి చేరారు. చికిత్స పొందుతున్న అతను శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందారు. వైద్యాధికారులు కరోనా పరీక్ష నిర్వహించగా పాజిటివ్​గా తేలింది. మృతదేహాన్ని పట్టణ సమీపంలోని గొల్లపల్లివాడ శ్మశాన వాటికకు తరలించారు. అదే సమయంలో గ్రామస్ఖులు శ్మశాన వాటికలో ఖననం చేయవద్దని అడ్డగించారు. అధికారులు నచ్చజెప్పిన వినకపోవటంతో చేసేదిలేక మృతదేహాన్ని మరో ప్రాంతానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించామని పట్టణ సీఐ జి. రాజు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details