ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జిల్లాలో మాస్కులపై అవగాహన.. మాస్క్ లేకుంటే జరిమానా

By

Published : Jun 27, 2020, 11:31 PM IST

కడప జిల్లాలో పోలీసులు మాస్కులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని డీఎస్పీతెలిపారు. మాస్కులేకుండా బయటకువస్తే రూ. 500 జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

kadapa dst police create awareness on mask
kadapa dst police create awareness on mask

కరోనా వైరస్ పంజా విసురుతున్న సమయంలో కడపలో పోలీసులు మాస్కులపై అవగాహన కల్పించారు. కడప జిల్లాలో రెండు రోజుల వ్యవధిలో 183 కేసులు నమోదు కావటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. డీఎస్పీ సూర్యనారాయణ సమక్షంలో పోలీసులు వీధుల్లో తిరుగుతూ మాస్కులు ధరించాలని సూచించారు. మాస్కులు లేకుండా బయటికి వస్తే రూ. 500 జరిమానా విధిస్తామని డీఎస్పీ హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details