కడప జిల్లా మైలవరం మండలంలోని నవాబుపేట గ్రామం మొత్తాన్ని శానిటైజ్ చేయాలని జాయింట్ కలెక్టర్ సిఎం. సాయి కాంత్ వర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. నవాబుపేట గ్రామంలో 25 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావటంతోపాటు ఒకరు మృతి చెందటం పట్ల జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ ఆదేశాల మేరకు నవాబుపేట గ్రామాన్ని జేసీ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
గ్రామంలో ఉన్న ఆశా కార్యకర్తల ద్వారా ఇంటింటి సర్వే నిర్వహించి దగ్గు, జలుబు, గొంతునొప్పి, జ్వరం, డయేరియా తదితర ఐదు లక్షణాలలో ఏవి ఉన్న వెంటనే వారికి పరీక్షలు చేయాలని ఆదేశించారు.