ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'బలవంతపు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు' - కడప డీఎస్పీ హిజ్రా సమావేశం తాజా వార్తలు

నగరంలోని హిజ్రాలతో కడప డీఎస్పీ సునీల్ సమావేశం ఏర్పాటు చేశారు. వాహనదారులు, పాదచారుల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

kadapa hizraas
హిజ్రాలతో కడప డీఎస్పీ సమావేశం, బలవంతపు వసూళ్లపై కడప డీఎస్పీ హిజ్రాలతో సమావేశం

By

Published : Mar 30, 2021, 9:43 AM IST

హిజ్రాలు బలవంతపు వసూళ్లకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కడప డీఎస్పీ సునీల్ స్పష్టం చేశారు. ఇటీవల కడపలో హిజ్రాలు.. వాహనదారులు, పాదచారుల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు పోలీసుల దృష్టికి రావడంతో డీఎస్పీ నగరంలోని తాలూకా పోలీస్ స్టేషన్లో హిజ్రాలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వారికి పలు సూచనలు జారీ చేశారు. డబ్బులు స్వచ్ఛందంగా ఇస్తే తీసుకోవాలి తప్ప వాహనదారులను ఆపి వారి నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తే కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. పలువురి నుంచి ఫిర్యాదులు రావడంతో నే సమావేశాన్ని ఏర్పాటు చేశామని డీఎస్పీ స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details