ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ మూల్యం చెల్లించాల్సిందే

కడప జిల్లాలో పాజిటివ్​ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలను ప్రజలు తప్పకుండా పాటించేలా పోలీసుశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ మేరకు కడప నగరంలో మాస్కులు లేకుండా తిరిగిన 850 మందిపై సుమారుగా రూ.28.75 లక్షల జరిమానా విధించినట్లు కడప డీఎస్పీ సూర్యనారాయణ వెల్లడించారు.

By

Published : Jun 20, 2020, 8:51 PM IST

నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ మూల్యం చెల్లించాల్సిందే
నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ మూల్యం చెల్లించాల్సిందే

నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ మూల్యం చెల్లించాల్సిందే

కడప జిల్లాలో కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతుండటంతో... నిబంధనలన్నీ ప్రజలు తప్పకుండా పాటించేలా పోలీసుశాఖ పకడ్బందీ చర్యలకు ఉపక్రమించింది. మాస్కులు లేకుండా బయటకు వచ్చేవారికి రూ.500 నుంచి రూ.1000 వరకూ జరిమానా విధిస్తున్నారు. ఇప్పటివరకు కడప నగరంలో మాస్కులు లేకుండా తిరిగిన 850 మందిపై సుమారుగా రూ.28.75 లక్షల జరిమానా విధించినట్లు కడప డీఎస్పీ సూర్యనారాయణ వెల్లడించారు. మద్యం దుకాణాలు, ఆసుపత్రులు, బ్యాంకుల వద్ద చాలామంది మాస్కులు లేకుండా కనిపిస్తున్నారు... అలాంటి చోట్ల సంబంధిత అధికారులను బాధ్యులుగా చేసి వారిపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. కడప జిల్లాలో మరోసారి లాక్​డౌన్​ కట్టడి లేకుండా ప్రజలు సహకరించాలని డీఎస్పీ కోరారు.

ఇదీ చూడండి:రాష్ట్రంలో కొత్తగా 491 కరోనా కేసులు నమోదు

ABOUT THE AUTHOR

...view details