వైకాపా ప్రభుత్వం పౌర సత్వ చట్టాలపై రెండు నాలుకల ధోరణి అవలంబిస్తోందని కడప జిల్లా తెదేపా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ప్రజా వ్యతిరేక చట్టాలకు కేంద్రంలో మద్దతు తెలుపుతూ.. రాష్ట్రంలో వ్యతిరేకంగా ఉండడం దారుణమన్నారు. ముస్లిం ఓట్లతో గద్దెనెక్కిన వైకాపా ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగా పాలన చేయడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ముస్లింలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
'వైకాపా ఎంపీలూ... రాజీనామాలకు సిద్ధమా' - పౌర సత్వ చట్టం తాజా వార్తలు
కేంద్రంలో 22 మంది వైకాపా ఎంపీలు రాజీనామా చేస్తే తెదేపా ఎంపీలు కూడా రాజీనామా చేస్తారని కడప జిల్లా తెదేపా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరారు. కేంద్రంలో ప్రజా వ్యతిరేక చట్టాలకు మద్దతు తెలుపుతూ.. రాష్ట్రంలో వ్యతిరేకంగా ఉన్నట్లు చెప్పడం వైకాపా రెండు నాలుకల ధోరణికి నిదర్శనమన్నారు.
డప జిల్లా తెదేపా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశం