ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 6, 2020, 3:30 PM IST

ETV Bharat / state

'మూడు రాజధానులపై ఉన్న శ్రద్ద కరోనాపై పెట్టండి'

సీఎం జగన్మోహన్​ రెడ్డి సొంత జిల్లాలో కరోనా కేసులు ఉగ్రరూపం దాలుస్తున్న ఆయన ఏమాత్రం పట్టించుకోవటం లేదని కడప జిల్లా తెదేపా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్​ ఆరోపించారు. సరైన వైద్యం లేక కరోనా బాధితులు అవస్థలు పడుతున్నారన్నారు. బుధవారం జిల్లాలో పర్యటించిన ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని కనీసం కోవిడ్ ఆసుపత్రులను సందర్శించకపోవటం దారుణమన్నారు.

కడప జిల్లా తెదేపా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్
కడప జిల్లా తెదేపా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్

కడప జిల్లా తెదేపా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్

ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే కరోనా వైద్యం అధ్వానంగా ఉందని కడప జిల్లా తెదేపా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించి ప్రజల ప్రాణాలు గాలిలో వదిలేశారన్నారు. కోవిడ్ సమీక్ష నిమిత్తం బుధవారం కడపకు వచ్చిన ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని కనీసం ఒక్క కోవిడ్ హస్పిటల్​ను తనిఖీ చేసిన దాఖలాలు లేవన్నారు. ఆన్లైన్ ద్వారా బాధితులతో మాట్లాడటం ఎంత వరకు సమంజసమని ఖండించారు. క్వారంటైన్​లో సరైన సౌకర్యాలు లేక పాజిటివ్ బాధితులు అల్లాడుతున్నారన్నారు. డిచార్జ్​ అయిన తర్వాత కనీసం రెండు వేల రూపాయలు కూడా ఇవ్వడం లేదని తెలిపారు. నాణ్యత లేని భోజనం పెడుతున్నారని విమర్శించారు. రిమ్స్ లో కనీసం వెంటిలేటర్లు లేవని చెప్పడం దారుణమని ఖండించారు. రోజుకు వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులుపై ఉన్న శ్రద్ధ కరోనాపై ఉంచాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details