రాష్ట్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసిన ట్రిపుల్ ఐటీ ఫలితాల్లో కడప జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. జిల్లాలోని ప్రొద్దుటూరుకు చెందిన జాకీర్ హుస్సేన్ 99 మార్కులు సాధించాడు. వేంపల్లికి చెందిన పోరెడ్డి మమత 97, ఎర్రగుంట్లకు చెందిన ఆవుల తరుణ్ కుమార్ 96, జమ్మలమడుగుకు చెందిన సాయి హర్షిత 95, పొద్దుటూరు చెందిన షాహిద్ అలీ 93 మార్కులు సాధించి ప్రతిభ కనపరిచారు.
ట్రిపుల్ ఐటీ ఫలితాల్లో కడప విద్యార్థుల ప్రతిభ - kadapa latest news
ట్రిపుల్ ఐటీ ఫలితాల్లో కడప జిల్లా విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. జిల్లాకు చెందిన ఐదుగురు విద్యార్థులు 90కిపైగా మార్కులు సాధించారు.
ట్రిపుల్ ఐటీ ఫలితాల్లో కడప విద్యార్థుల ప్రతిభ
ట్రిపుల్ ఐటీ ఫలితాల్లో 95 మార్కులు రావడం చాలా ఆనందంగా ఉందని జమ్మలమడుగు పట్టణానికి చెందిన సాయి హర్షిత ఆనందం వ్యక్తం చేసింది. బాగా చదువుకుని ఐఏఎస్ కావడమే తన లక్ష్యమని స్పష్టం చేసింది.
ఇదీచదవండి.