ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పరిషత్ ఎన్నికలపై పోలీసులకు ఎస్పీ దిశానిర్దేశం - కడపజిల్లాలో పరిషత్ ఎన్నికలు వార్తలు

కడపజిల్లా జమ్మలమడుగులో ఎస్పీ అన్బురాజన్ పర్యటించారు. రేపు పరిషత్ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో.. పోలీసు సిబ్బందికి కీలక సూచనలు చేశారు. ఎన్నికల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని.. కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆదేశించారు.

Kadapa district SP instructions to police on Parishath elections
పరిషత్ ఎన్నికలపై పోలీసులకు సూచనలిస్తున్న ఎస్పీ

By

Published : Apr 7, 2021, 6:29 PM IST

కడప జిల్లా జమ్మలమడుగు డీఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ అన్బురాజన్ ... పరిషత్ ఎన్నికలపై పోలీసు అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఎన్నికల ప్రక్రియలో జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తతతో, సమయస్ఫూర్తితో ఎన్నికల విధులు నిర్వర్తించాలని సూచించారు. మహిళలకు ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేయాలని, మంచినీళ్ల బాటిళ్లు, ఇంకు సీసాలు, బాల్ పెన్నులు, మొబైల్ ఫోన్లు మొదలైన వాటిని అనుమతించకూడదని తెలిపారు.

పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్లలోపు జనసమూహం లేకుండా చూసుకోవాలని.. ఎటువంటి ప్రచారాలకు అనుమతి లేకుండా చూడాలని సూచించారు. అదేవిధంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చే ఓటర్లు, ముఖ్యంగా మహిళలు, వృద్ధుల పట్ల మర్యాదపూర్వకంగా, స్నేహపూర్వకంగా వ్యవహరించాలని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details