ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగాయన్నది అవాస్తవం' - kadapa district news today

కడప జిల్లాలోని పొన్నతోట ఆంజనేయ స్వామి ఆలయంలో నిధుల కోసం తవ్వకాలు జరిగాయన్న దుష్ప్రచారంపై జిల్లా ఎస్పీ స్పందించారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

kadapa district sp anburajan conducted meeting in kadapa
కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్

By

Published : Sep 29, 2020, 9:06 PM IST

కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని పొన్నతోట ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగాయనేది పూర్తి అవాస్తవమని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. భారీగా కురిసిన వర్షానికి భూమి కుంగి పెద్ద గుంత ఏర్పడిందన్నారు.

సున్నితమైన అంశాన్ని సామాజిక మాధ్యమాల్లో తప్పుగా ప్రచారం చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details