కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి వైరస్ వ్యాప్తి నివారణకు సహకరించాలని కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ సూచించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని రెడ్‌జోన్ ప్రాంతాలను ఎస్పీ సందర్శించారు. లాక్‌డౌన్ అమలు, పోలీసు బందోబస్తును పరిశీలించిన ఎస్పీ... ప్రజలు అనవసరంగా బయటకు రాకూడదన్నారు. సామాజిక దూరం తప్పనిసరిగా పాటించి పోలీసులకు సహరించాలని కోరారు. 60 ఏళ్లకు పైబడిన వారిపై కరోనా ప్రభావం ఎక్కువగా ఉందని.. పలు సర్వేలు చెబుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
ప్రజలు పోలీసులకు సహకరించాలి: ఎస్పీ అన్బురాజన్ - కడప జిల్లాలో లాక్‌డౌన్
ప్రజలు అనవసరంగా బయటకు రాకుండా పోలీసులకు సహకరించాలని కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ అన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని కోరారు.
కడప జిల్లాలో లాక్‌డౌన్