వాలంటీర్లకు ఇచ్చే విలువ కూడా.. ప్రభుత్వం తమకు ఇవ్వడం లేదని కడప జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు శివ చంద్రరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో అపరిశుభ్రత తాండవిస్తోందన్న అయన.. కనీసం పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ఉన్నామని వాపోయారు. కడప ప్రెస్ క్లబ్లో సంఘ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన.. గ్రామాల్లో విద్యుత్ దీపాల బిల్లులు పెండింగ్లో ఉన్నాయన్నారు. వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
Sarpanch Forum: "వాలంటీర్లకు ఉన్న విలువ కూడా.. మాకు లేదా?"
జిల్లాలోని గ్రామ పంచాయతీలకు తక్షణమే నిధులు కేటాయించాలని కడప జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు శివ చంద్రరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మౌలిక వసతులు కల్పనకోసం తోడ్పాటు అందించాలని కోరారు.
Sarpanch Forum
త్వరలోనే తమ సమస్యలపై ముఖ్యమంత్రిని కలుస్తామని శివచంద్రరెడ్డి చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో మలేరియా, టైఫాయిడ్, డెంగీ జ్వరాలు విజృంభిస్తున్నాయని అన్నారు. జిల్లావ్యాప్తంగా ఉండే 790 మంది సర్పంచులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పంచాయతీలకు నిధులు కేటాయించి.. మౌలిక వసతులు కల్పించే విధంగా తోడ్పాటు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇదీ చదవండి
Last Updated : Nov 6, 2021, 5:13 PM IST