కడప జిల్లా పుల్లంపేటలో పుల్లంగేరు వాగు జల కళ సంతరించుకుంది. తిరుమల అటవీ ప్రాంతంలో భారీగా వర్షం కురిసిన కారణంగా.. ఆ నీరంతా దిగువ ప్రాంతమైన పుల్లంగేరుకు చేరుకుంది. నీరు మరింత ఉద్ధృతంగా ప్రవహిస్తే రాజంపేటలోని పోలి చెరువుకు చేరుతుంది. వర్షాలు పడకపోయినా పుల్లంగేరు పారడం వల్ల భూగర్భ జలాలు పెరిగి తాగునీటికి, సాగునీటికి ఇబ్బంది ఉండదని రైతులు సంతోషిస్తున్నారు. ఐదేళ్లుగా ఇంతటి ప్రవాహాన్ని చూడలేదని చెప్పారు.
పొంగిన పుల్లంగేరు... విరిసిన అన్నదాత మోము - కడప జిల్లా
కడప జిల్లా రాజంపేట మండలంలోని పుల్లంపేటని పుల్లంగేరు పొంగి పొర్లింది. ఇటీవల కురిసిన వర్షాలకు పుష్కలంగా వరద నీరు చేరింది.
పొంగిన పుల్లంగేరు... విరిసిన అన్నదాత మోము..