వ్యవసాయ రంగానికి సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్ద పీట వేశారని కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జునరెడ్డి అన్నారు. రాజంపేట మండలం ఎర్రవల్లిలో వ్యవసాయ ప్రయోగ కేంద్రం భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం, ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవడం, వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమే లక్ష్యంగా వ్యవసాయ రంగంలో నూతన ఒరవడికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. వ్యవసాయానికి అనువైన నేల స్వభావాన్ని తెలుసుకునేందుకు.. స్థానికంగా పరీక్షలు నిర్వహించేందుకు ఈ ల్యాబ్ నిర్మాణాన్ని చేపడుతున్నామని పేర్కొన్నారు.
'వ్యవసాయ రంగానికి పెద్ద పీట' - kadapa district news today
కడప జిల్లా రాజంపేటలో స్థానిక ఎమ్మెల్యే మల్లికార్జునరెడ్డి పర్యటించారు. ఎర్రవల్లిలో ఏర్పాటు చేసిన వ్యవసాయ ప్రయోగ కేంద్రం నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అధికార వైకాపా ప్రభుత్వం.. వ్యవసాయ రంగానికి ఎంతో కృషి చేస్తోందని తెలిపారు.
ఎర్రవల్లిలో ల్యాబ్ భవన నిర్మాణానికి శంకుస్థాపన