కడప జిల్లా ప్రొద్దుటూరు బుడ్డాయపల్లెకు చెందిన గంగుల భువన్రెడ్డి... జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఆల్ ఇండియా రెండో ర్యాంకు సాధించాడు. భువన్ తల్లిదండ్రులు, బంధవులు ఆనందం వ్యక్తం చేశారు.
చరవాణి ద్వారా యువకుడిని కేంద్ర విద్యాశాఖ మంత్రి అభినందించారు. ఐఐటీ ముంబైలో సీటు సాధించటమే తన లక్ష్యమన్న భువన్... తల్లిందండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో ఈ విజయం సాధించగలిగానని చెప్పాడు.