ఐపీఎల్ మ్యాచ్ లపై బెట్టింగ్ కు పాల్పడుతున్న 11 మంది బుకీలను కడప జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. కడప పోలీసు సబ్ డివిజన్ పరిధిలోని కడప నగరం, చిన్నచౌకు పోలీస్ స్టేషన్ల పరిధిలో మూడు వేర్వేరు కేసుల్లో 11 మందిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అన్బురాజన్ తెలిపారు.
నిందితుల నుంచి 34 లక్షల రూపాయల నగదు, బ్యాంకు ఖాతాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఐపీఎల్ మ్యాచ్ ల సందర్భంగా ఇటీవల 20 కేసులు నమోదు చేసి 60 మంది క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లను అరెస్ట్ చేశామని ఆయన తెలిపారు. బెట్టింగ్‌ను సహించేది లేదన్నారు.