ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రూ.కోటి చొప్పున నిధులతో గ్రామాల అభివృద్ధి' - news on pmajy houses

కడప జిల్లాలో ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన కింద ఎంపికైన గ్రామాల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ హరికిరణ్ అధికారులను ఆదేశించారు. ఒక్కొక్క గ్రామానికి కోటి రూపాయల నిధులు వెచ్చించి సాచ్యురేషన్ మోడ్ లో అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు.

kadapa district on pmjay villages
కలెక్టర్ హరికిరణ్

By

Published : Jul 15, 2020, 10:19 PM IST

కడప జిల్లా పరిధిలో ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన కింద ఎంపికైన గ్రామాలను తీర్చిదిద్దాలని కలెక్టర్ సి. హరికిరణ్ అన్నారు. కలెక్టర్ చాంబర్లో జిల్లా స్థాయి కన్వర్జెన్స్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. జిల్లాలోని 12 మండలాల్లో 18 గ్రామాలను పీఎంఏజేవై కింద ఆదర్శ గ్రామాలుగా అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. ఈ గ్రామాల్లో జూలై 30 వ తేదీ లోపల అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు అధికారులు పనులు వేగవంతం చేయాలన్నారు. ఎస్సీ జనాభా 50 శాతం కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాలను పీఎంఏజేవై కింద గుర్తించినట్టు కలెక్టర్ చెప్పారు. 18 గ్రామాలకు పీఎంఏజేవై కింద రూ.20 లక్షల చొప్పున మంజూరయ్యాయన్నారు. ఒక్కొక్క గ్రామానికి కోటి రూపాయల నిధులు వెచ్చించి సాచ్యురేషన్ మోడ్ లో అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details