రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న తరుణంలో కడప జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. మతపరమైన సమావేశం కోసం దిల్లీ వెళ్లిన వారితో పాటు విదేశాలకు వెళ్లిన వారి వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బద్వేల్‌కు చెందిన ఓ వ్యక్తి దిల్లీలో జరిగిన సభకు వెళ్లి ఈ నెల 17న పట్టణానికి చేరుకున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇతనితో పాటు మరో ఇద్దరు విదేశాలకు వెళ్లి వచ్చినట్లు గుర్తించారు. వైద్య పరీక్షల నిమిత్తం వీరిని పోలీసులు కడప రిమ్స్‌కు తరలించారు.
కరోనా విజృంభణతో కడప జిల్లా అధికారులు అప్రమత్తం - badvel coeona updates
రాష్ట్రంలో కొవిడ్-19 కేసులు పెరుగుతున్నందున కడప జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. మతపరమైన సమావేశానికి దిల్లీ వెళ్లిన వారితో పాటు విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరిస్తున్నారు.
కరోనా విజృంభణతో కడప జిల్లా అధికారులు అప్రమత్తం